రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇకపోతే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 12 సంవత్సరాల తర్వాత తమ పూర్వికుల స్వగ్రామం అయిన మొగల్తూరుకు సెప్టెంబర్ 28 వ తేదీన వెళ్ళనున్నారు అలాగే అక్కడ రెండు రోజులపాటు ఉండనున్నట్లు సమాచారం. ఇక 29వ తేదీన కృష్ణంరాజుకు సంస్కరణ సభతో పాటు భారీ సమారాధనలో కుటుంబ సభ్యులతో పాటు ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దాదాపు 12 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ మొగల్తూరు రావడంతో వారి నివాసంలో భారీ ఏర్పాట్లు శరవేగంగా జరుపుకుంటున్నాయి.
ఇకపోతే అప్పుడు తండ్రి కోసం.. ఇప్పుడు పెదనాన్న కోసం ఇలాంటి పని చేయబోతున్నాడు ప్రభాస్.. అదేమిటంటే మొగల్తూరు రావడమే .. నిజానికి ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు 2010లో మృతి చెందినప్పుడు ఆయన అంత్యక్రియలో హైదరాబాదులో నిర్వహించారు. ఇక దిన కార్యక్రమాలను మాత్రం మొగల్తూరులో ప్రభాస్ ఏర్పాటు చేసి హాజరవడం జరిగింది. ఇప్పుడు పెదనాన్న మరణంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత పెదనాన్న పెద్దకర్మ కోసం కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉండడం గమనార్హం. ఇక మరొకవైపు తమ పూర్వీకుల నివాసానికి రంగులతోపాటు లోపల ఫర్నిచర్ కూడా మారుస్తున్నారు. మొత్తం 50 మంది కార్మికులు దాదాపు 5 రోజులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
మరొకవైపు కృష్ణంరాజు నివసించిన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఈనెల 23వ తేదీన దశదిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డులను మొగల్తూరులోని బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి 70 వేల మంది కి పైగా హాజరవబోతున్నట్లు వారికి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా కృష్ణంరాజు అంతిమ పద్ధతులను చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.