The Raja Saab: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో డార్లింగ్ ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్ మాళవిక మోహన్, మరో నటి నిధి అగర్వాల్, రిద్దికుమార్‌లు నటిస్తున్నారు.

అయితే తాజాగా…ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా టీజర్ కు ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 10:52 గంటలకు రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు అదిరిపోయే టీజర్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కనిపించలేదు కానీ… దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తోందని ఈ ప్రోమో లో చెప్పేశారు.
It’s more than a vibe…
it’s a REBEL ENERGY ⚡#TheRajaSaabTeaser Tomorrow at 10:52AM. #Prabhas #TheRajaSaab pic.twitter.com/OrB7oZEEI2— The RajaSaab (@rajasaabmovie) June 15, 2025