మేడిగడ్డపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంది.. మేడిగడ్డ విచారణకు రంగం సిద్ధం ఐంది. కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలకు కసరత్తు చేస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలన్న విజిలెన్స్ నివేదిక తయారు చేసింది.

కొందరిపై FIR, మారికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ తో మంత్రి ఉత్తమ్ చర్చలు చేస్తున్నారు. తదుపరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు అదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు.