తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అన్ని భాషలలో తన హవా కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బోల్డ్ గా పలు సినిమాలలో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అంతే కాకుండా పలు కొటేషన్లను షేర్ చేస్తూ, పలు జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఎక్కువగా తన సమయాన్ని సోషల్ మీడియాలోనే కేటాయిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలను, వర్కౌట్ ఫోటోలకు సంబంధించి అసలు విషయాన్ని తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
ఇక వర్కౌట్, డైట్లు అనేవి కేవలం అమ్మాయిలు అందం కోసమే కాదని ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని సమంత తెలియజేసింది. ఎలాంటి పని చేసే వారైనా సరే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సమంత తెలియజేయడం జరిగింది. ఆరోగ్యం బాగా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారని తెలియజేసింది సమంత. ఇప్పుడు సమంత చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక సమంత ప్రతిరోజు కూడా కనీసం ఒక గంట అయినా జిమ్ లో గడపకపోతే తనకు నిద్ర రాదట. అందుచేతనే కచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక సమయానికి జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటానని తెలియజేసింది. అంతేకానీ మరే ఉద్దేశంతో ఈ ఫోటోలు వీడియోలు షేర్ చేయలేదని తెలిపింది.