ఏదేమైనా తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా తెలవైన వారే అని చెప్పాలి..రాజకీయంగా ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో ఆయనకు తెలివి ఎక్కువగానే ఉంది. ఎప్పుడు ఎలాంటి రాజకీయ వ్యూహంతో వస్తారో..ప్రత్యర్ధుల ఊహాకే అందదు..తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలతో కేసీఆర్ పనిచేస్తూ ఉంటారు..అయితే ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఎప్పుడు తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు…గతంలో ముందస్తుకు వెళ్ళి సక్సెస్ అయ్యారు. అయితే అప్పుడు ఆయన సడన్ గా ముందస్తుకు వెళ్లారు. ప్రత్యర్ధుల ఊహకు అందని విధంగా ముందస్తుకు వచ్చి…ఎన్నికల్లో గెలిచారు.
దీంతో కేసీఆర్ ముందస్తుపై కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. బీజేపీ ఎన్నికల తేదీ ప్రకటిస్తే…అప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్దామని అన్నారు…అంటే కేసీఆర్..ముందస్తు బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. అయితే బీజేపీ కూడా కేసీఆర్ కు ధీటుగా స్పందిస్తూ…ముందస్తుకు తాము రెడీ అని, ఎప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తారో చెప్పాలని కేసీఆర్ ని డిమండ్ చేసింది. అటు కాంగ్రెస్ సైతం అసెంబ్లీ రద్దు చేస్తే…ఈ ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చింది. అంటే ప్రతిపక్షాలు మళ్ళీ ముందస్తు బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టేశాయి. ఇప్పుడు ముందస్తుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అందుకే ముందస్తుపై ప్రతిపక్షాలతో సవాళ్ళకు దిగారు…అంటే ప్రతిపక్షాలు కూడా ముందస్తుకు సై అంటే..కేసీఆర్ కూడా ముందస్తుకు వస్తారు…అప్పుడు ఏదో సవాళ్ళ మధ్యలో ముందస్తు జరుగుతుందని ప్రజలు భావిస్తారు…ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసిన ఎన్నికలు త్వరగా జరగకపోతే కేంద్రం మీద నెపం వేసే కార్యక్రమం చేస్తారు. అంటే ఎటు తిప్పిన తనకు మళ్ళీ బెనిఫిట్ రావాలనేది కేసీఆర్ ఆలోచన. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలు ఏ మేర వర్కౌట్ అవుతాయో చూడాలి.