టాలీవుడ్ లో కోట్లు వసూలు చేస్తున్న బాలీవుడ్ భామలు వీళ్లే..!

-

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు బాలీవుడ్ లో సత్తా చాటడానికి తక్కువ రెమ్యునరేషన్ కి కూడా పనిచేస్తూ ముందు తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ దీనికి పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో అడుగు పెట్టాలి అంటే వాళ్లకు కోట్లల్లో కనక వర్షం కురిపించాల్సిందే.. కోట్ల రూపాయల పారితోషకం ఇస్తే తప్ప టాలీవుడ్లో అడుగుపెట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి.  అయితే ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కి టాలీవుడ్ లో మాత్రం భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపద్యంలోనే టాలీవుడ్ లో బాలీవుడ్ భామలు టాలీవుడ్ హీరోయిన్లకు మించి కోట్ల రూపాయలు అందుకొంటూ ఉండడం గమనార్హం. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
దీపికా పదుకొనే:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచిన దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలు హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇక ఈ సినిమా కోసం ఈమె ఏకంగా రూ.18 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
దిశా పటానీ:
ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనేతో పాటు దిశా పటానీ కూడా అవకాశం దక్కించుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నందుకు గానూ రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
జాన్వీ కపూర్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగులో నటించబోతోంది జాన్వీ కపూర్.. ఈ సినిమా కోసం ఈమె రూ .5కోట్ల పారిపోషకం తీసుకుంటోంది.
కియారా అద్వానీ:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న కియార అద్వాని ఈ సినిమా కోసం రూ.4కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news