దిగుబడి బాగా వచ్చే పంట ఇది.. ఈ సాగు తో తిరుగు ఉండదు..!

-

పంటలను పండించడానికి ఎన్నో రకాల విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి, అంటే ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం, వర్షపాతం మరియు ఏ రకమైన మట్టి ఉంటుందో అలా అన్నీ అనుకూలంగా ఉంటేనే ఆ రకమైన పంటను సాగు చేయడం మేలు. భారతదేశంలో పాటుగా పాకిస్తాన్, టర్కీ, మెక్సికో వంటి ఇతర దేశాలలో శెనగ పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో చూసుకుంటే బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువ శాతం శెనగ పంటను పండిస్తారు.

 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో శెనగ పంటను కేవలం రబీ పంటగా పండిస్తూ ఉంటారు. అయితే ఈ పంట నల్ల రేగడి భూముల్లో సాగు చేయడం జరుగుతుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే సుమారు 11 లక్షల ఎకరాలు శెనగ పంటకి కేటాయించడం జరుగుతోంది. అయితే దిగుబడి కూడా 3.9 లక్షల టన్నులు వరకూ వస్తూ ఉంటుంది. సహజంగా శెనగ పంట ఎకరానికి 362 కిలోల వరకు పండించడం జరుగుతుంది.

ఈ పంటను పండించాలంటే వాతావరణం చల్లగా ఉండాలి, అందుకే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రబీ సీజన్లో మాత్రమే దీనిని పండించడం జరుగుతుంది. అంతేకాకుండా శెనగ పంట తక్కువ వర్షపాతం అంటే 600 నుండి 1000 ఎం ఎం ఉన్న ప్రాంతాలలో పండిస్తే చాలా మంచి దిగుబడి వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.ఈ శెనగ పంట కు వేర్లు లోతుగా ఉంటాయి, శెనగలు భూమిలో పండుతాయి. అలాంటప్పుడు భూమిలో ఉండే తేమ ఈ పంట ఉపయోగించుకుంటుంది.

దానివల్ల తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ పంట బాగా పండుతుంది. అంతేకాకుండా ఈ విధంగా భూమిలో పడడం వల్ల నీటి నిల్వ అనేది భూమిలో ఉండకూడదు. కాబట్టి తేలికపాటి తడులు ఉంటే సరిపోతుంది. అంతేగాని నీటి నిల్వ ఉండడం వల్ల గింజలు తయారీ అవ్వవు. ఈ పంటకు సుమారుగా ఉష్ణోగ్రత 24 నుండి 30 సెంటీగ్రేడ్లు వరకు ఉంటే అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news