పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారో .. అటు వైవాహిక జీవితంలో, ఇటు రాజకీయ రంగంలో ఆ గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక పేరుని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాదు ఈ కాలం యువతకు ఐకాన్ స్టార్ గా మారిన పవర్ స్టార్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు.
హీరోగా ఇండస్ట్రీ లోకి ఇష్టం లేకపోయినా తన వదిన సురేఖ ప్రోత్సాహంతో 1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత తొలిప్రేమ, తమ్ముడు, బద్రి , ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో రికార్డులు తిరగ రాశారు.