అత్యధికంగా చదువుకున్న టాలీవుడ్ హీరోలు వీరే..!

-

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ఉన్నత చదువులు చదివి.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో.. ఉన్న ఉద్యోగాలను కూడా వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది చదువు అబ్బక ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న తెలుగు హీరోల చదువు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నందమూరి కళ్యాణ్ రామ్:
కళ్యాణ్ రామ్ తన గ్రాడ్యుయేషన్ బిట్స్ పిలాని నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు . ఆ తర్వాత అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.

అవసరాల శ్రీనివాస్:
అవసరాల శ్రీనివాస్ అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

అక్కినేని నాగార్జున:
నాగార్జున చెన్నైలో ఇంజనీరింగ్ చేసి.. అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీర్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.

వెంకటేష్:
హైదరాబాదులోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బీకాం పూర్తి చేసి .. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు.

సాయి ధరంతేజ్:
బయోటెక్నాలజీలో మనదేశంలో టాప్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశాడు.

రామ్ చరణ్:
రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి డిగ్రీ పట్టా అందుకున్నాడు.

రాజశేఖర్:
ఎంబిబిఎస్ పూర్తి అయిన తర్వాత డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత యాక్టర్ గా మారి ఇండస్ట్రీలో కడుగు పెట్టాడు.

అల్లు అర్జున్:
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version