విజ్యువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’కు ముందు అనుకున్న హీరోలు వీళ్లే..

-

డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రికార్డుల వేటకు బయలుదేరిన ఈ ఫిల్మ్..ప్రేక్షకులను చాన్నాళ్ల తర్వాత థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది. విజ్యువల్ వండర్‌గా రూపొందించబడిన ఫిల్మ్ ను థియేటర్ లో ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిందే అని సినీ పరిశీలకులు, క్రిటిక్స్ పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో జనాలు ఇంకా ఎక్కువ మంది టాకీసులకు వెళ్తున్నారు.

‘బాహుబలి’ కంటే ముందు నుంచే తాను మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నానని రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన్ రామ్ చరణ్ , తారక్ లతో చిత్రం తీశాడు. ఈ పిక్చర్ సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణం.. వీరు ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ బెస్ట్ ఫ్రెండ్సని అభిమానులు చెప్తున్నారు. ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరూ చించేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని చూసిన తర్వాత హీరోలుగా వీరిని కాకుండా ఇంకెవరినీ ఊహించుకోలేము. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ స్టోరి రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి వీరి కంటే ముందర పలువురు హీరోలను చిత్రంలో భాగం చేయాలనుకున్నారు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రదర్స్ సూర్య-కార్తీ పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే చివరకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను డైరెక్టర్ రాజమౌళి ఫైనల్ చేశారు. ఇక పిక్చర్ చూసిన ప్రతీ ఒక్కరు వీరిరువురు తప్ప ఇంకెవరూ కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించలేరని అంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version