టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘‘ ది వారియర్’’. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా, శ్రీనివాసా చిట్టూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ వచ్చే నెల 14న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది.
రేపు సాయంత్రం హైదరాబాదర్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. కాగా.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చక్కగా అందించారు. ట్రైలర్ లో నదియా చాలా శక్తిమంతమైన మహిళగా కనిపించింది. ఇక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యగా..రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని సమచారం.
It's time to take the Mass Euphoria to Next Level 🔥#TheWarriorrTelugu Pre Release Event Tomorrow from 6 PM 🥳
📍JRC Conventions, Hyd#TheWarriorrOnJuly14@ramsayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic @masterpieceoffl pic.twitter.com/IiJjxdXqVx
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 9, 2022