మా అమ్మకు నేనిచ్చిన బెస్ట్ గిప్ట్ ఇదే.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!

-

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే తారక్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. సెప్టెంబర్ 27న దేవర మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేస్తున్నాడు.

తాాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో పాటు తన తల్లిని తీసుకొని ఉడిపికి వెళ్లాడు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తరువాత తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ” మా అమ్మ ఎప్పుడూ తన సొంతూరు కుందాపురాతో పాటు ఉడిపి శ్రీ కృష్ణుడి దర్శనం చేయించాలని కలలు కంటుంటుంది. ఇప్పుడు ఆ కల నిజం అయింది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టిన రోజు కావడంతో నేను ముందుగానే ఆమెకు ఇచ్చిన బెస్ట్ గిప్ట్ ఇదే. విజయ్ కిరంగదూర్ కి ధన్యవాదాలు. అదేవిధంగా రిషబ్ షెట్టి కూడా అందులో భాగమైన క్షణాలను ప్రత్యేకంగా చేశాడు” అంటూ ట్వీట్ చేశాడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version