జబర్దస్త్ నుంచి అనసూయ అవుట్ అవ్వడానికి అసలు కారణం ఇదే..!!

2013లో ప్రముఖ ఛానల్ ఈటీవీలో మల్లెమాల నిర్మాత శాంప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమం జబర్దస్త్.. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా నాగబాబు ,రోజా వ్యవహరించగా.. వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటివారు కమెడియన్లుగా పనిచేసేవారు. ఇక అలా వారి కామెడీ తో ప్రేక్షకులు అలరించడమే కాకుండా ఎంతో మంది కొత్త వాళ్లను కూడా ఆదరించడం జరిగింది. అలా ఇప్పుడు సుదీర్, ఆది, అభి లాంటివారు జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులు నుంచి ఈ కార్యక్రమం నుంచి ఒక్కొక్కరు బయటకు పోతున్న విషయం తెలిసిందే.కానీ ఏ ఒక్కరు కూడా అసలు విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోని జబర్దస్త్ స్టేజీపై అందాల హొయల వొలకబోసిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఈమె కూడా తాజాగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇక ఈమె స్థానంలో మరొక కొత్త యాంకర్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మల్లెమాల. అందరూ కూడా సినిమాలలో అవకాశాలు రావడం వల్ల అక్కడ డేట్స్ ఖాళీగా లేకపోవడం కారణంగా అనసూయ జబర్దస్త్ ను వదిలేసింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు దర్శకుడు క్రిష్ వల్లే ఆమె జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.The Next Super Star | Star Maa Music | Anasuya | Vjsunny | Anchor Ravi |  Neha - YouTube

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ వేదిక పైన అనసూయకు కేవలం 2లక్షల పారితోషకం మాత్రమే ఇచ్చేవారు. కానీ మాటీవీలో ప్రస్తుతం జూనియర్ సింగర్ షో లో సుధీర్ తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అక్కడ వారు ఆమెకు రూ.4 లక్షల పారితోషకం ఒక్కొక్క ఎపిసోడ్ కు ఆఫర్ చేయడం అలాగే ఆమెకు ఖాళీ సమయం ఉన్నప్పుడే వచ్చి షూటింగ్లో పాల్గొనమని చెప్పడంతో ఇన్ని అద్భుతమైన ఆఫర్లను వదులుకోవడం ఎవరికైనా కష్టమే కదా అందుకే ఆమె తనకు లైఫ్ని ఇచ్చిన జబర్దస్త్ నే వదిలేసి ఇలా మాటీవీలో పలు షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.