ఈ వారమూ థియేటర్లో చిన్న చిత్రాలదే హవా

-

గత నాలుగు వారాలుగా థియేటర్లలో చిన్న చిత్రాల హవాయే నడుస్తోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరి ఈ వీక్ ఎలాంటి చిన్న సినిమాలు రాబోతున్నాయి..? అవి బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపబోతున్నాయి? ఓ లుక్కేద్దామా?

‘పారిజాత పర్వం’ : సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘శరపంజరం’ : నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది.

‘మార‌ణాయుధం’  : ఒకప్పటి కథానాయయిక మాలాశ్రీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రూపొందిన ఈ చిత్రం గతేడాది కన్నడలో విడుదలై ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది.

‘లవ్‌ యూ శంకర్‌’ : ‘మై ఫ్రెండ్‌ గణేశా’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజీవ్‌ ఎస్‌. రియా ఏప్రిల్‌ 19న లవ్‌ యూ శంకర్‌ సినిమాతోప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version