ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్‌ ‘టైగర్‌3’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

సల్మాన్‌ ఖాన్‌  – కత్రినా కైఫ్‌ ఈ జంట కలిసి నటించిన టైగర్ ఫ్రాంచైజీ అంటే ప్రేక్షకులకు అమితాసక్తి. అందుకే ఈ సినిమా రెండు సీక్వెల్స్ కు ఇప్పటికే ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అందుకే ఈ సినిమా డైరెక్టర్ మనీశ్ శర్మ ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఫ్యాన్స్ కోసం టైగర్-3 సినిమా తీశారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మొదటి రెండు సినిమాల్లాగే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్షన్ కే కాదు కత్రినా కైఫ్ బ్యూటిఫుల్ ఫైట్ సీక్వెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా కత్రినా బాత్ టవల్ ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇందులో పఠాన్ హీరో షారుక్ ఖాన్ క్యామియో ఇటు భాయ్ ఫ్యాన్స్ తో పాటు అటు బాద్ షా అభిమానులను అలరించింది. ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. అయితే మీకో గుడ్ న్యూస్ టైగర్-3 ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news