రేవ్‌ పార్టీ కేసులో నా పేరు లేదని నిరుత్సాహపడ్డారేమో: నటుడు నవదీప్‌

-

తెలుగు రాష్ట్రాల్లో బెంగళూర్ రేవ్ పార్టీ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుపై నటుడు నవదీప్ స్పందించారు. బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని అన్నారు. ‘ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడంలేదు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని నవదీప్ తెలిపారు.

తన కొత్త సినిమా ‘లవ్‌ మౌళి’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌ మీట్‌లో రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా నవదీప్ ఈ విధంగా స్పందించారు. ‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్‌ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని .. ఈ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని నవదీప్ చెప్పుకొచ్చారు. నవదీప్ కామెంట్స్పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news