తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

-

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. విద్యార్థులకు వేసవికాలం సెలవులు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో  గత వారం రోజుల నుంచి తిరుమల వీధులు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి.

ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. శనివారం స్వామి వారిని 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 44,479 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news