టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ !

-

బెంగుళూరు ఫామ్ హౌజ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో ముగ్గురు తెలుగు సినిమా నటులు దొరికారు. నటి హేమ తోపాటు.. శ్రీకాంత్ మేఖ, అషి రాయ్ లకు పాజిటివ్ వచ్చింది. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో నటి హేమ తోపాటు.. శ్రీకాంత్ మేఖ, అషి రాయ్ లకు నోటీసులు పంపింది CCB హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు అధికారులు.

Srikanth, Hema , Bengaluru rave party

ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డి ఉన్నారు. A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులు ఉన్నారు. 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్, కొకైన్ తో ఉన్న 500 రూపాయల నోట్లు ఉన్నాయట.

5 మొబైల్ ఫోన్స్, ఒక ఫోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, కోటిన్నర డీజే ఎక్విప్మెంట్ ఉందని సమాచారం. 73 మంది యువకులు పార్టీలో పాల్గొనగా 59 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news