RCB: ఆర్సీబీ ఇజ్జత్ తీసిన అంబటి రాయుడు.. సంబరాలతో కప్పు గెలవలేరు..!

-

Ex CSK Star Ambati Rayudu’s Post Mocking RCB Sets Internet Ablaze: ఆర్సీబీ ఇజ్జత్ తీశాడు అంబటి రాయుడు.. సంబరాలతో కప్పు గెలవలేరన్నాడు. ప్లేఆఫ్స్ లో రాజస్థాన్ పై ఓటమి అనంతరం ఆర్సిబికి సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. “ఫ్యాషన్, సెలబ్రేషన్స్ తో ట్రోఫీలు రావు. ప్లేఆప్స్ కు చేరితేనే టైటిల్లు వస్తాయనుకోవడం పొరపాటే అవుతుంది.

Ex CSK Star Ambati Rayudu’s Post Mocking RCB Sets Internet Ablaze

టోర్నీలో అన్ని మ్యాచ్లు బాగా ఆడితేనే టైటిల్ కొడతారు. చెన్నైపై గెలిస్తేనే ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తామనే భ్రమలో ఉండొద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాయుడు కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక అటు ఎలిమినేటర్ లో ఆర్సిబి ఓటమిపై స్పందిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్….కోహ్లీ ఐపిఎల్ ట్రాఫిక్ అర్హుడు అని, అతడు ఆర్సిబిని వీడాలని కోరారు. ‘గతంలో చెప్పా…మళ్లీ చెబుతున్నా… గొప్ప ఆటగాళ్లు జట్లను వీడి కీర్తి గడించారు. కోహ్లీ ఈసారి ఆరెంజ్ క్యాప్ సాధించారు. అయినా జట్టు ఫెయిల్ అయింది. అతడు హోమ్ టీం ఢిల్లీలో చేరాలి’ అని KP అన్నారు. ఈ సీజన్ లో కోహ్లీ 741 రన్స్ తో టాప్ స్కోరర్ గా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news