బెంగుళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్‌ నటి హేమ ?

-

బెంగుళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్‌ నటి హేమ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రేవ్ పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో రాజకీయ పార్టీ నాయకులు, సీనీ తారలు పాల్గొన్నారని సమచారం. ఇక ఈ రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు పోలీసులు.

Tollywood actress Hema in Bangalore rave party

ఈ పార్టీలో డ్రగ్స్ MDMA మరియు కొకైన్ గుర్తించారట. అయితే… బెంగుళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్‌ నటి హేమ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వెంటనే సినీ నటి హేమ స్పందించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను… నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదని వెల్లడించారు. అనవసరంగా నన్ను లాగుతున్నారు…కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news