హీరో శర్వానంద్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

-

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్​కు గత కొంత కాలం క్రితం నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నిశ్చితార్థం గురించి ఫుల్ ఖుష్ అయిన ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూశారు. నెలలు గడిచినా పెళ్లి మాట రాకపోయేసరికి కాస్త నిరాశ చెందారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అంటూ వస్తున్న వార్తలు చూసి ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. అయితే ఆ వార్తలన్నీ పుకార్లేనని తాజాగా తెలిసింది.

హీరో శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదిక కానుంది. జూన్‌ 2, 3 తేదీల్లో గ్రాండ్‌గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ వెడ్డింగ్‌కు స్నేహితులు, ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు ఆహ్వానం అందనున్నట్లు సమాచారం. పెళ్లి తేదీలను ఖరారు చేయడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ యంగ్‌ హీరో పేరు ట్రెండ్‌ అవుతోంది. కాబోయే వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. శర్వానంద్‌, రక్షితా రెడ్డిల నిశ్చితార్థం ఈ ఏడాది ప్రారంభంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version