కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. రేపే ప్రమాణస్వీకారం!

-

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ నిర్ణయం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్​ల మధ్య ఎవరిని సీఎం చేయాలన్న దానిపై పార్టీ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు అగ్రనేతలు ముఖ్యమంత్రి కుర్చీని చెరో రెండున్నర ఏళ్లు పంచుకొనున్నారని తెలిసింది. మొదటి రెండున్నర ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

డీకే శివకుమార్​కు డిప్యూటీ సీఎం పదవి, నీటి పారుదల, విద్యుత్ శాఖ మంత్రి పోస్టు ఖరారైందని సమాచారం. గురువారమే సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.తాజాగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉదయం 11.30 సమయంలో రాహుల్ నివాసానికి వెళ్లిన సిద్ధరామయ్య.. చర్చల అనంతరం తాను బస చేసే హోటల్​కు తిరిగి చేరుకున్నారు. మరోవైపు, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​ సైతం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సీఎం సీటుపై డీకే శివకుమార్​, సిద్ధరామయ్య.. రాహుల్​తో చర్చించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version