కేసీఆర్ ను మెచ్చుకున్న టాలీవుడ్‌ హీరో..ఆయనో అద్భుతం !

-

కేసీఆర్ ను మెచ్చుకున్నారు టాలీవుడ్‌ హీరో సుమన్‌. ఇవాళ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు సినీ నటుడు సుమన్. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. గుడిలోపటలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు.

ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఎంతో మంది శిల్పులు పనిచేసి అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, భవిష్యత్తులో యాదగిరిగుట్ట ఆలయం దేశ, విదేశాల్లో మరింత ఖ్యాతిని పొందుతుందని తెలిపారు సుమన్.

Read more RELATED
Recommended to you

Latest news