ప్యాన్ ఇండియా ప్రాజెక్టుల‌కు జై కొడుతున్న టాలీవుడ్ హీరోలు.. మ‌రో హీరో కూడా!

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న కోసం పెద్ద ద‌ర్శ‌కులు కూడా క‌థ‌లు రాసుకుంటున్నారంటే ఆయ‌న స్టార్ డ‌మ్ ఎంతో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో ఆయ‌న సినిమాన‌లు డ‌బ్ చేసి పాపులారిటీ పెంచుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఓ భారీ ప్రాజెక్ట‌ను లైన్ లో పెట్టాడు.

ఇప్పుడు టాలీవుడ్ హీరోలంద‌రూ ప్యాన్ ఇండియా మూవీ ప్రాజెక్టులే చేస్తున్నారు. తానెందుకు త‌క్కువ అనుకున్న మ‌న రౌడీ స్టార్ ఆయ‌న కూడా పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్ లో పెట్టాడు. లైగ‌ర్ కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌ర‌ణ్ జోహార్‌.. త‌ర్వాత ప్యాన్ ఇండియా మూవీని కూడా తీయ‌నున్నాడ‌ట‌.

ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే విజ‌య్‌ను ఇన్ స్టాగ్రామ్ లో క‌త్రినా ఫాలో అవుతోంది. ఇక లైగ‌ర్ త‌ర్వాత దీన్ని ప‌ట్టాలెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే దీనికి ఇంకా డైరెక్ట‌ర్ ను డిసైడ్ చేయ‌లేదు. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ తో కాస్త విరామం దొరికడంతో ఆ ప‌నిలో ప‌డ్డాడంట క‌ర‌ణ్ జోహార్‌. మ‌రి బాలీవుడ్ లో విజ‌య్ ఏ రేంజ్ లో ర‌చ్చ‌చేస్తాడో చూడాలి.