సినిమాతారగా, రాజకీయ నాయకురాలిగా మాధవీలత అందరికీ సుపరిచితురాలే. నచ్చావులే సినిమాతో పరిచయమైన ఈ భామ.. ఆపై అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత తాను చేసే వ్యాఖ్యలతో బాగా ఫేమస్ అయింది. ఆ మధ్య శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఎంటరవ్వడంతో లైమ్ లైట్‌లోకి వచ్చింది.

కాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ మాధవి లత ఆయనకు విషెస్ చెబుతూ ‘మిస్టర్’ అని సంబోధిస్తూ పోస్ట్ చేయడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఆమె కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. ‘విషెస్ చెబితే ఇంత రచ్చ అవసరమా? మీరు తమ్ముడు గారు, బాయ్ ఫ్రెండ్ గారు, మొగుడుగారు అంటారేమో…? నేను కాదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాపై నెగటివ్ కామెంట్స్ చేస్తే… మీరే పవన్ ను నాశనం చేస్తున్నట్లు’ అని మండిపడ్డారు.