సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బియాండ్ ది సక్సెస్ అన్నట్టుగా ఉంటాయి హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా కంటిన్యూ అవుతున్న ఆ మెంటలెక్కించే కాంబోలు టాలీవుడ్ లో ఎన్ని ఉన్నాయో చూద్దామా
పోకిరి సినిమాతో పూరి మహేష్ ఇండస్ట్రీని ఏ స్థాయిలో షేక్ చేశారో తెలిసిందే. తెలుగు తెరకు సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ మహేష్ కెరియర్ కే టర్నింగ్ పాయింట్ మూవీ ఇచ్చాడు ఇలాంటి కాంబో నుంచి మరో మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
పవన్ త్రివిక్రమ్ రిలేషన్ సినిమాతో సంబంధం లేకుండా సాగుతోంది లైక్ మైండెడ్ పీపుల్ కు నిర్వచనంగా కనిపిస్తుంటారు వీరిద్దరూ. వీరి కలయికలో మరో మూవీ కావాలంటున్నారు ఫ్యాన్స్ పవన్ యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్న ఈ సమయంలో ఓ పవర్ ఫుల్ మూవీ వస్తే ఆ కిక్కే వేరప్పా అంటున్నారు.
ఎన్టీఆర్ రాజమౌళి.. ఇంచుమించు వీళ్లిద్దరూ ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసినట్టు లెక్క వీళ్ల రిలేషన్ బియాండ్ ది సినిమా. ఇప్పటి వరకు వీరి కాంబోలో 4 సినిమాలు వచ్చాయి ఇంకో 44 మూవీస్ వచ్చినా మేము రెడీ అంటారు ఆడియన్స్.
ఏ మాయ చేసావే మజిలీ వంటి హార్ట్ టచింగ్ మూవీస్ తో సిల్వర్ స్క్రీన్ పై ది బెస్ట్ కపుల్ గా నిలిచిపోయారు సమంత నాగచైతన్య. వీళ్ల పర్సనల్ లైఫ్ తో సంబంధం లేకుండా ఇప్పుడుగానీ మరో లవ్ స్టోరీలో వీరిద్దరూ యాక్ట్ చేస్తే ఆ క్రేజే వేరు.
ప్రభాస్ అనుష్క జంటకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆన్ స్క్రీన్ వీళ్లిద్దరి కెమిస్ట్రీ కేక పెట్టిస్తుంది ఆఫ్ స్క్రీన్ వీళ్లిద్దరూ ఒక్కటి కావాలని కోరుకునే వాళ్లూ ఎక్కువే. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నా అనుష్క గురించి సింగిల్ అప్డేట్ కూడా లేదు ఇలాంటి టైమ్ లో వీళ్లిద్దరూ ఓ మూవీలో చేస్తే బాగుండు అని కోరుకుంటున్నారు సగటు ఫ్యాన్స్.
అప్పుడెప్పుడో వేదం లాంటి కల్ట్ మూవీతో సర్ ప్రైజ్ చేసిన కాంబో ఇది అప్పుడు అల్లు అర్జున్ యావరేజ్ హీరో కాగా క్రిష్ కూడా సగటు దర్శకుడు. ఇలాంటి టైమ్ లో క్రిష్ టేకింగ్ బన్నీ యాక్టింగ్ కలిస్తే ఆ సినిమా తగ్గేదే లే అనడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన ప్రతీ సినిమా ఆయన పేరు మీదనే డిస్కషన్లో ఉంటుంది లేదంటే హీరోతో సమానంగా ఆయనకు ప్రశంసలు దక్కుతాయి కానీ.. రాజమౌళి దర్శకత్వాన్ని డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో రవితేజ. ఇది సాక్షాత్తూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పిన మాట నిజంగానే తనదైన కామెడీ యాక్షన్ తో విక్రమార్కుడిలా చెలరేగిపోయాడు రవితేజ ఇలాంటి కాంబో మళ్లీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది.