టాలీవుడ్ రివైండ్ 2018 : బాక్సాఫీస్ అదరగొట్టిన సినిమాలివే..!

-

కొత్త సంవత్సరం అంటే సినిమా పండుగ షురూ అయినట్టే. రానున్న 2019 సూపర్ ఓపెనింగ్ ఇచ్చేందుకు క్రేజీ సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక గడిచిన 2018 లో టాలీవుడ్ పరిస్థితి ఏంటి.. బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టిన సినిమాలేంటి.. స్టార్ సత్తా చాటిన సినిమాలేవి.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అందుకే 2018 టాలీవుడ్ ఓవర్వ్యూ స్పెషల్ గా మీకు అందిస్తుంది మనలోకం.కామ్

రంగస్థలం

ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ముందుగా ప్రస్థావించాల్సి వస్తే చిట్టిబాబు గురించి చెప్పాలి. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో 103.52 కోట్ల షేర్ తో చరణ్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

గీతా గోవిందం.

ఇక ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో సెకండ్ ప్లేస్ సంపాదించిన సినిమా గీతా గోవిందం. యువ సంచలనం విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేశాడు. కేవలం 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్.. 56.95 కోట్ల షేర్ తో సంచలన విజయం అందుకుంది.

మహానటి

2018 బ్లాక్ బస్టర్ మూవీస్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న సినిమా మహానటి. బయోపిక్ సినిమాలకు కొత్త ఉత్సాహం ఇచ్చే సావిత్రమ్మ జీవిత చరిత్రను నాగ్ అశ్విన్ ఎంతో అందంగా తెరకెక్కించాడు. కీర్తి సురేష్ మహానటి పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమా విజయంలో భాగమయ్యారు.

ఆరెక్స్ 100

బ్లాక్ బస్టర్ లిస్ట్ లో టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించుకుంది ఆరెక్స్ 100. బోల్డ్ మూవీగా ప్రచారం పొందినా ఈ సినిమా బడ్జెట్ 2 కోట్లు కాగా 12.05 కోట్ల షేర్ తో సెన్సేషనల్ హిట్ సాధించింది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు.

ఈ ఇయర్ సూపర్ హిట్ సినిమాలు చెక్ చేస్తే నాగ శౌర్య, రష్మిక మంద నటించిన ఛలో సినిమా ముందు స్థానంలో ఉంది. 9.52 కోట్ల షేర్ తో ఛలో 2018 సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది. అడివి శేష్ చేసిన స్పై థ్రిల్లర్ గూఢచారి మూవీ కూడా ఈ ఇయర్ సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది. 7.85 కోట్లతో గూఢచారి అదరగొట్టింది.

2018 హిట్ సినిమాలు ఏంటని చూస్తే ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే భాగమతి సినిమాతో బంపర్ హిట్ అందుకుంది అనుష్క. పిల్లజమిందార్ అశోక్ డైరక్షన్ లో అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీ 23.19 కోట్లతో హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది.

వరుణ్ తేజ్ తొలిప్రేమ 20.44 కోట్లతో 2018 హిట్ సినిమాల ఖాతాలో చేరింది. ఇక ఇదే లిస్ట్ లో రాం నటించిన హలో గురు ప్రేమ కోసమే సినిమా కూడా ఉంది. 19.73 కోట్లతో రాం సినిమా హిట్ అందుకుంది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా కూడా 2018 హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. 18.30 కోట్లతో దేవరకొండ విజయ్ కు మళ్లీ హిట్ కిక్ ఇచ్చింది.

వీటితో పాటుగా ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా 76.75 కోట్ల షేర్ తో 2018 హిట్ సినిమాల లిస్ట్ లో చేరగా సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా 76.20 కోట్ల షేర్ తో మహేష్ కు మరో హిట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news