‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ ట్రైలర్ రిలీజ్.. మామూలుగా లేదుగా..!

-

శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం అనుకున్నవన్నీ జరగవు కొన్ని. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. పెళ్లి అనేది ఒక్కరినే చేసుకోవాలిరా.. ప్రేమ అనేది పది మందికి పంచమన్నాడు రా జార్జ్ బ్రూస్ లి అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు డబ్బుతో ముడి ఉన్నట్టు కనిపిస్తోంది.

ఓ అపార్టుమెంట్ లో ఓవ్యక్తిని ఎవరో హత్య చేశారు.. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు..? దానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతుంటారు. పోసాని కామెడీ, డైలాగ్ లు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. హీరో, హీరోయిన్.. వారిద్దరూ ఒక్కటి ఎలా ఒక్కటయ్యారు.. లవర్స్, కొలిగ్సా.. ప్రెండ్సా, ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు పోసాని. మండేలా అంటూ పోసాని చేసిన కామెడీ బాగుంది.. అనుకున్నవన్నీ జరగవు కొన్ని అనే డైలాగ్ పోసాని చెబుతాడు. మొత్తానికి ఈ ట్రైలర్ చాలా బాగుందనే చెప్పవచ్చు.సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం నవంబర్ 03 వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news