ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ జనరల్ సెక్రెటరీ సుభాష్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుభాష్ రెడ్డి కి టికెట్ రాకపోవడం పై కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో మీడియాతో మాట్లాడుతూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
తాను ఎల్లారెడ్డిలో దశాబ్ద కాలంగా పార్టీ కోసం కృషి చేశానని.. గత ఏన్నికల్లో టికెట్ త్యాగం చేశానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్హి మదన్ మోహన్ ను కచ్చితంగా ఒడిస్తానని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో కంటతడి పెట్టిన సుభాష్ రెడ్డి
నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. రెబల్ గా ఉంటా.. ఇంటింటికి వెళ్తా.. కాంగ్రెస్ కు నేను ఏం తక్కువ చేశానని, నా టికెట్ అమ్ముకున్నారు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి .. నీవెంట ఉంటే నాకు టికెట్ దక్కకుండా చేసావు..
పీసీసీ అధ్యక్షడు అమ్ముడు పోయారు. మదన్ మోహన్ ఎలా గెలుస్తాడో చూస్తా..? నా ప్రాణం ఉన్నంత వరకు మదన్ మోహన్ ను ఎమ్మెల్యే గా గెలవనివ్వను. నాకు అన్యాయం జరిగింది. తాను రెబెల్ గా గెలిచినా, ఓడినా.. ప్రజా సేవలోనే ఉంటానని పేర్కొన్నారు.
నా నిర్ణయం ఎవరు ఆపలేరు.. కార్యకర్తల నిర్ణయం మేరకు ముందుకు వెళ్తా. కాంగ్రెస్ పార్టీ లాబీయిస్టు పార్టీ గా మారిందన్నారు సుభాష్ రెడ్డి.