త్రిష సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది..

తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అందాల తార త్రిష నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ తమిళ మూవీ రాంగి రూపొందుతుంది. ‘రాంగి’… తమిళంలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమా టైటిల్‌. ‘రాంగి’ అంటే ‘వితండవాదం చేసే అమ్మాయి’ అని అర్థమట! ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే… ర‌జనీకాంత్ ద‌ర్భార్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కథ అందిస్తున్నారు. ఆయన శిష్యుడు శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంకి కేఏ శ‌క్తివేల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిద్ర‌బృందం సోష‌ల్‌మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది. యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాటాలు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. కాగా, త్రిష గ‌తంలో న‌టించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు నాయ‌కి, మోహిని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. మ‌రి ఈ చిత్రంతో అయిన స‌క్సెస్ సాధిస్తుందా చూడాలి. మ‌రియు వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కానుంది.