గంటకో మలుపు తిరుగుతోన్న శ్రావణి సూసైడ్ కేసు

గంట గంటకో మలుపు తిరుగుతోంది నటి కొండపల్లి శ్రావణి కేసు వ్యవహారం. ఒకప్పుడు దేవరాజును ఎంతగానో ప్రేమించిన శ్రావణి తర్వాత గొడవలు రావడంతో అతనితో విడిపోయింది. ఈ క్రమంలో దేవరాజుకు, శ్రావణి కుటుంబసభ్యులకు బాగా దూరం పెరిగింది. అయితే ఆగస్టు 9న దేవరాజు పుట్టినరోజు సందర్భంగా శ్రావణి అతన్ని మళ్లీ కలిసింది. వాళ్లిద్దరూ ఆ రోజు సన్నిహితంగా మెలిగిన వీడియో కూడా రికార్డయింది. అయితే దేవరాజుతో మళ్లీ సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా శ్రావణి జాగ్రత్త పడింది.

అయితే అప్పటికే దేవరాజతో శ్రావణి కుటుంబ సభ్యులకున్న విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దేవరాజ్ దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు ఇవ్వాలంటూ శ్రావణి నిలదీసిన క్రమంలోనే శ్రావణి తమ్ముడు, బావ, దేవరాజ్ మధ్య గలాటా జరిగింది. ఇందులో దేవరాజ్ తలకు గాయం కాగా తనను చంపిడానికి ప్రయత్నించారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు దేవరాజ్. పంజాగుట్ట పీఎస్ లో శ్రావణి, ఆమె తమ్ముడు శివ, మరో ఇద్దరిపైన కేసు నమోదయింది. దీంతో ఆమె కూడా దేవరాజ్ తనని వేదిస్తున్నాడని కేసు పెట్టింది.