బిగ్ బాస్ ఆరవ సీజన్లో రెండవ వారం జరుగుతున్న నేపథ్యంలో 21 మంది కంటెస్టెంట్ లు కూడా చాలా హుషారుగా ఆటలు ఆడుతూ విన్నర్ అవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొట్లాటలు, గొడవలు అన్నీ జరుగుతున్నాయి.
మొత్తానికి ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొదటి వారంలో ఎలిమినేషన్ లేదు. కంటెస్టెంట్స్ లకు రెండు వారాల సమయం ఇచ్చారు మేకర్స్. తద్వారా వార తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ వారం ముగియడంతో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.
నాగార్జున ప్రకటనతో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున షాక్ అయ్యారు. అప్డేట్ ప్రకారం షన్నీ మరియు అభినయశ్రీ లు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కంటెస్టెంట్స్ ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. మరియు షో కి ఎటువంటి తేడా లేకుండా ఉన్నారు. మరియు ఎలిమినేట్ పై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.