పాపం ఈ హీరోయిన్ల పరిస్థితి ఇక అంతేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ లు అయిన శ్రీ లీల, మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం మంచి ఊపులో దూసుకుపోతున్నారు. కెరియర్లో ఫుల్ జోష్లో దూసుకెళ్తున్న వీరిద్దరూ ఎంతోమంది కుర్ర హీరోలకే కాదు సీనియర్ హీరోయిన్లకి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్ కారణంగా అటు పూజా హెగ్డే , ఇటు రష్మికకు తలనొప్పిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సినీ ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచంలో కొత్త సరుకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే కొత్తదనానికి కొత్త అందాలకే టాలీవుడ్ మొదటి అవకాశం ఇస్తుందనే చెప్పాలి.

అందుకే ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తూనే ఉంటారు అయితే అదృష్టం బాగుంటే ఒక్క సినిమాతోనే స్టార్ గా మారిపోయి.. ఆ తర్వాత అవకాశాలను అందుకుంటుంటారు. కానీ కొత్తవారు రావడంతో పాతవారికి క్రమంగా అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇక కొన్నిసార్లు వారికి వచ్చిన అవకాశాలు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక మెల్లమెల్లగా చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి రష్మిక, పూజా హెగ్డే వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

పూజ హెగ్డే నటించబోయే సినిమాలలో శ్రీ లీల, మృణాల్ అవకాశాలను అందుకుంటుంటే మరొకవైపు రష్మిక కి కూడా పోటీగా శ్రీ లీల అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.ఇక్కడ అసలు విషయంలోకి వెళితే.. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ 12 సినిమాలో పూజా ను తప్పించి శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. అలాగే నితిన్ తో నటించే అవకాశం రష్మికకు వచ్చినప్పటికీ కూడా అందులో మేకర్స్ రష్మీకాను తప్పించి శ్రీ లీలాను తీసుకోవడం జరిగింది. ఇలా శ్రీ లీల, మృనాల్ ఠాకూర్ వల్ల అటు పూజా హెగ్డే , ఇటు రష్మిక ఇద్దరికీ కూడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏది ఏమైనా వారిద్దరి వల్ల వీరిద్దరికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version