ఉప్పెన క్లైమాక్స్ విషాదాంతం..?

-

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. కొత్త అమ్మాయి క్రితి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ పాటలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పెన సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఐతే ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఉప్పెన క్లైమాక్స్ విషాదాంతం అని అంటున్నారు. ఏం జరుగుతుందనేది పక్కన పెడితే సినిమా మాత్రం విషాదంగా ముగుస్తుందట. మరి విషాదాంతాలని తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్న. ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. కథ విషాదాంతం అయినా కొత్తగా ఉంటే ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version