‘వాలంటైన్స్‌ డే’కు రీరిలీజ్ కానున్న లవ్‌స్టోరీస్ ఇవే

-

వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఆ రోజున లవర్‌తో సమయం గడిపేందుకు చాలా మంది ఆ డేని పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. మీకోసమే మీ వాలెంటైన్ డేను మరింత స్పెషల్‌గా మార్చేందుకు గతంలో అలరించిన లవ్‌ స్టోరీలు మరోసారి మిమ్మల్ని ఎంటరైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఏకంగా నాలుగు సూపర్‌ హిట్‌ సినిమాలు ప్రేమికుల రోజు రీరిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి అవేంటో చూసి మీ వాలెంటైన్‌ డేను ప్రత్యేకంగా ప్లాన్ చేస్కోండి.

వాలంటైన్స్‌ డే’కు రీరిలీజ్ కానున్న లవ్‌స్టోరీస్ ఇవే

  • సిద్ధార్థ – షామిలీ కలిసి నటించిన ఓయ్
  • దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్‌ల మూవీ సీతారామం
  • తమిళ్ హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌
  • విజయ్ సేతుపతి, త్రిషల కల్ట్ లవ్ స్టోరీ 96

ఇవే కాకుండా పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రెండోసారి రీరిలీజ్ కానున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, జై, అనన్య, ‘జర్నీ’ కూడా ఫిబ్రవరి 14న రీరిలీజ్‌ అవుతాయంటూ న్యూ ఇయర్ నాడు పోస్టర్లు విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version