Varalaxmi Sarathkumar : ఎద అందాలతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

-

టాలీవుడ్ లో సెంటిమెంట్ల‌కు కొదువేలేదు. ఒక యాక్ట‌ర్ చేస్తే సినిమా హిట్ అవుతుందంటే చాలు ఆమె కోస‌మే ప్ర‌త్యేకంగా పాత్ర‌లు రాసి మ‌రీ యాక్ట్ చేయిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి లిస్టులో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ చేరిపోయారు. సినిమా అంటేనే విజ‌యాల వెన‌క ప‌రుగెడుతుంది.


అందుకే ఆమెను విజ‌యాల కోసం వ‌రుస ఆఫ‌ర్లు ఇస్తున్నారు మూవీ మేక‌ర్స్‌. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ మొద‌ట‌గా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. అయితే దాని త‌ర్వా త ర‌వితేజ‌తో చేసిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రను వ‌ర‌ల‌క్ష్మీ పండించింద‌నే చెప్పాలి.


ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ర‌వితేజ‌కు ఈ సినిమా పెద్ద హిట్ ఇచ్చింది. వ‌రుసగా ఇద్ద‌రు హీరోల‌కు మంచి హిట్లు ఇవ్వ‌డంతో వరలక్ష్మి కి ఆఫ‌ర్లు పెరిగాయి. ఆమెను గోల్డెన్ లెగ్‌గా కీర్తిస్తూ సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇక రీసెంట్‌గా అల్లరి నరేష్ నాంది సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే.

దీంతో ఆమెకు ప‌వ‌ర్ ఫుల్ లేడీ పాత్ర‌లు క్యూ క‌డుతున్నాయి. అలాంటి పాత్ర ఏది ఉన్నా ఆమెనే ఎంచుకుంటున్నారు సినిమా మేక‌ర్స్‌. త్వ‌ర‌లోనే బాల‌య్య సినిమాలో కూడా చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. అలాగే జాంబిరెడ్డి మూవీ డైరెక్ట‌ర్ అయిన ప్రశాంత్ వర్మ తీస్తున్న హను మాన్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version