Varalaxshmi Sarathkumar: టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలలో నెగిటివ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. లేడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారిపోయారు వరలక్ష్మి శరత్ కుమార్. పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇది ఇలా ఉండగా, తన పెళ్లి విషయంలో వస్తున్న ట్రోలింగ్ పై హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. ‘నేను నికోలయ్ సచ్ దేవ్ ను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదు. నా సంపాదనతో నేను చాలా సంతోషంగా ఉన్నా. అలాంటప్పుడు నేను డబ్బు కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటా. నికోలయ్ తన మొదటి భార్యతో కలిసి ఉన్నప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది. ఆయన ప్రవర్తన, మర్యాద చూసి నాకు ప్రేమ కలిగింది. నా కళ్ళకు ఆయన ఎప్పుడు హీరోనే’ అని ఆమె చెప్పారు.