లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదని జాతీయ మీడియా కథనం పేర్కొంది. కేవలం ఒక సీటు నుంచి పోటీ చేయకుండా దేశమంతా ప్రచారం చేస్తేనే పార్టీకి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. ఈ క్రమంలోనే ప్రియాంక ప్రచారాన్ని ఉద్ధృతం చేసిందని వివరించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని టాక్. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వారసత్వ రాజకీయాలు అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అందుకే పోటీలో నిలవకుండా తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మే 3నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభిస్తారని సmమాచారం. ప్రియాంక ఎన్నికలకు దూరంగా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత నెలకొంది.