వర్మ పాడిన “మర్డర్‌” పిల్లల్ని ప్రేమించడం తప్పా?? పాట విడుదల

-

రామ్‌గోపాల్‌ వర్మ కంపెనీ నుండి వస్తున్న మర్డర్‌ సినిమాలోంచి పిల్లల్ని ప్రేమించడం తప్పా?? అంటూ సాగే పాటను విడుదల చేశారు. పాట మొత్తంగా తండ్రి పడిన ఆవేదన తెలియజేసేలా ఉంది. ఈ పాటను వర్మనే స్వయంగా పాడాడు. తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటించగా, కూతురు పాత్రను అవంచ సాహితి చేసింది. రెండు గంటల నిడివి గల ఈ చిత్రానికి ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించాడు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తారని తెలుస్తుంది.

ఇటీవలీ విడుదల చేసిన మర్డర్‌ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని వరంగల్‌ లో జరిగిన నిజజీవిత కధ ఆదారంగా తెరకెక్కిన్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వర్మ నుండి నగ్నం అనే చిత్రం కూడా రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version