లావణ్యకు నేనే ప్రపోజ్‌ చేశా.. తన లవ్ స్టోరీ చెప్పిన వరుణ్‌ తేజ్

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. అయితే ఈ జంట లవ్ లో ఎప్పుడు పడింది. ఎలా పడింది. అసలు ఎవరు ఎవరికి ముందుగా ప్రపోజ్ చేశారు. ఇలా వారి ఫ్యాన్స్ మదిలో ఎన్నో ప్రశ్నలు. తాజాగా ఆ ప్రశ్నల్లో కొన్నింటికి వరుణ్ సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి.. వరుణ్ సమాధానాలేంటో ఓసారి చూద్దామా.. ?

ప్రస్తుతం వరుణ్.. ‘గాంఢీవధారి అర్జున’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన.. ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడాడు. లావణ్యకు తానే ప్రపోజ్‌ చేశానని అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తనకు ఏం ఇష్టమో ఆమెకు బాగా తెలుసన్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే.. ?

‘‘దాదాపు ఐదారేళ్ల నుంచి మేమిద్దరం స్నేహితులం. తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నాకు ఏం ఇష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులు కలవడంతో రిలేషన్‌లోకి వచ్చాం. నేనే మొదట ప్రపోజ్‌ చేశా. ఇరు కుటుంబాలు మా నిర్ణయాన్ని అంగీకరించాయి. నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్‌గా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. తాను వాడుతున్న ఫోన్‌ను లావణ్య గిఫ్ట్‌గా ఇచ్చిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version