వాట్సాప్ రోజుకో ఫీచర్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రపంచంలో వాట్సాప్ యూజర్లు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. యూజర్ల సంఖ్య మరింత పెంచేందు.. ఇప్పటికే ఉన్న యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకొస్తోంది. తాజాగా హెచ్ డీ ఇమేజ్ క్వాలిటీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్.
వాట్సాప్ లో ఎంత మంచి క్వాలిటీ ఇమేజ్ అయినా అవతలి వ్యక్తికి పంపించాక దాని క్వాలిటీ దెబ్బతింటుంది. హెచ్‌డీ క్వాలిటీ ఇమేజులు పంపించాలంటే మెయిల్ చేయడమో, లేదంటే ఇతర మార్గాలను ఆశ్రయించడమో చేయాల్సి వచ్చేది. కొంతమందైతే క్వాలిటీ చెడిపోకుండా ఉండేందుకు వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ ఆప్షన్ ఎంచుకుని ఫొటోలు పంచుకుంటారు. ఇకపై అలాంటి ఇబ్బందులకు పడకుండా..వాట్సాప్‌లోనే ఇకపై హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను (HD images) పంచుకోవచ్చు. వాట్సాప్ యూజర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.
ఈ సదుపాయం వినియోగించడానికి చాట్ మెనూలో ఉన్న కెమెరా ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీకు కావాల్సిన ఫొటోను సెలక్ట్ చేసుకున్నాక మీకు పైన హెచ్‌డీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలక్ట్ చేసుకుంటే మంచి క్వాలిటీలో ఇమేజ్ సెండ్ అవుతుంది.