పలాస డైరెక్టర్​తో వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే గాండీవధారి అర్జున షూటింగ్ పూర్తి చేసుకున్న వరుణ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తాజాగా ఆ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా షేర్ చేశాడు. తన కొత్త సినిమా టైటిల్‌ను ‘మట్కా’గా (matka) వెల్లడించాడు. మట్కా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశాడు. ‘పలాస’తో విజయాన్ని సొంతం చేసుకున్న కరుణకుమార్‌ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై మట్క తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం రోజున హైదరాబాద్‌లో జరిగింది.

ఇందులో వరుణ్‌ తేజ్ మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రని పోషించనున్నాడని టాక్. 1975 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మట్కా ఆట ప్రధానంగా ఈ సినిమా రానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదలవుతుంది. ‘సరికొత్త ప్రపంచానికి ఉషస్సు’ అంటూ విడుదల చేసిన ఈ కొత్త సినిమా పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇందులో వరుణ్‌తేజ్‌ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. అలాగే నోరా ఫతేహి ఓ కీలకపాత్రలో కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version