టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు ఆ తర్వాత.. పిల్లలను కూడా కనేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో హీరోయిన్ ఇషికా దత్త తల్లి అయింది. టాలీవుడ్ హీరోయిన్..ఇషికా దత్త రెండోసారి తల్లి కావడం జరిగింది. తాజాగా ఆమెకు పండంటి కూతురు పుట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో హీరోయిన్ ఇషికా దత్త… పోస్ట్ పెట్టారు.

2017 సంవత్సరంలో బాలీవుడ్ నటుడు వత్సల్ సేత్ ను ఇషికా దత్త… పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మరో కూతురు వచ్చింది. ఇది ఇలా ఉండగా..ఇషికా దత్త.. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా గోపీచంద్ నటించిన చాణక్యుడు… మూవీలో మెరిసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించారు. ఇక అటు ఇషికా దత్త భర్త వత్సల్ ఆది పురుష్ సినిమాలో కూడా కనిపించాడు.