రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ప్రముఖ సినీ నటుడు, హీరో శ్రీకాంత్. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హీరో శ్రీకాంత్.. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో స్వామివారి ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…మొదటిసారిగా రాజన్న దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని… కార్తీక మాసం సందర్భంగా ఉపవాసాలు ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు హీరో శ్రీకాంత్.
జనవరి 10 న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతోందని అందులో హీరో రామ్ చరణ్ తో కలిసి నేను నటించానని వెల్లడించారు. మరో మూడు సినిమాలు కళ్యాణ్ రామ్ సాయిధర్మతేజ్ సినిమాలలో నటిస్తున్నానని… నేను ఒకటి హీరోగా కూడా నటిస్తున్నానని తెలిపారు హీరో శ్రీకాంత్. కుమారుడు రోషన్ కూడా అశ్వినిదత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నానని పేర్కొన్నారు. తన కొడుకు కెరీర్ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు హీరో శ్రీకాంత్.