డిసెంబర్ 31 వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డిసిపి మాదాపూర్ వినిత్ కుమార్ మాట్లాడుతూ… రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం పై ఫోకస్ పెట్టమమని.. డిసెంబర్ 15 వరకు న్యూ ఇయర్ వేడుకలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
డిసెంబర్ 15 తరువాత న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వమబోమని ప్రకటించారు. ఎవరైనా వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి అన్నారు. అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వ హిస్తే.. చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రనికులను టార్గెట్ చేసి చోరీల పాల్పడుతున్న ముఠా ఐదుగురుని అరెస్ట్ చేసామని..మల్లెపల్లి మాంగారు బస్తికి చెందిన దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నామని తెలిపారు. గతంలో 30 చోరీ కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు… బాధితుల నుండి ఫిర్యా దు మేరకు, కేస్ దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు.