ఎఫ్-2 డిలీటెడ్ సీన్ చూశారా.. నవ్వులే నవ్వులు..!

-

ఈ సంక్రాంతికి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎఫ్-2 అంటూ వచ్చిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డులు సృష్టించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నిర్మాతగా చాలా కాలం తర్వాత ఆయనకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

డిజిటల్ స్ట్రీమింగ్ లో వస్తున్నా ఇంకా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆడుతూనే ఉంది ఎఫ్-2. ఇక ఈ సినిమా నుండి డిలీటెడ్ సీన్ ఒకటి యూట్యూబ్ లో వదిలారు. వెంకీ బావని మరదలు మెహ్రీన్ ఆడించే సీన్.. మరదలిని ఇరికిద్దామని అనుకుంటే అక్కదగ్గర బావని ఇరికిస్తుంది మెహ్రీన్. అంతేకాదు హనీ ఈజ్ ద బెస్ట్ అనేస్తుంది. ఆ సరదా సన్నివేశం సినిమా నుండి ఎందుకు కట్ చేశారో కాని ఈ సీన్ ఉంటే ఇంకా నవ్వులు పండేవి. ఇక ఎఫ్-2 డిలీట్ సీన్ 1 ఇది కాగా ఇక మీదట మరిన్ని డిలీటెడ్ సీన్స్ వస్తాయని తెలుస్తుంది. మొత్తానికి యూట్యూబ్ లో కూడా ఎఫ్-2 సందడి షురూ అయినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version