సాహో ఓవర్సీస్ రికార్డ్.. ఇది కదా ప్రభాస్ రేంజ్..!

-

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ కు వెళ్లాడో అందరికి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి రెండు పాత్రల్లో ప్రభాస్ నటనకు అందరు ముగ్ధులయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో మీద అందరి గురి ఉంది. సుజిత్ డైరక్షన్ లో సాహో వస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుంది. శంకర ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియోస్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ కూడా చేస్తుంది. సాహో సినిమా ఓవర్సీస్ లో 36 కోట్ల డీల్ కుదిరిందట. చైనా తప్పించి ఈ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లోనే ఈ రేంజ్ హవా ఉంటే ఇక ఇండియా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు, తమిళ, హింది భాషల్లో వస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version