“బలగం”లో ప్రియదర్శి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ కమెడీయన్ !

-

తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవన స్థితిగతులను చూపిస్తూ మూవీలు ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడూ వస్తున్నాయి. అలాంటి చిత్రమే ‘బలగం’. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని టాలీవుడ్‌లో కమెడియన్‌గా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వేణు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్​ ను సొంతం చేసుకున్న చిత్రం బలగం. తెలంగాణ గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ మూవీతో ప్రముఖ కమెడియన్ వేణు యెల్దండి కూడా ఎంత ఎత్తుకి ఎదిగారో తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించారు. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. అయితే.. ఈ సినిమాలో సాయిల్‌ పాత్రలో ప్రియదర్శి నటించాడు. కానీ మొదటగా దర్శకుడు వేణునే.. సాయిల్‌ పాత్రలో నటించాలని దిల్‌ రాజ్‌ కోరాడట. కానీ దానికి ఆయన ఒప్పుకోక పోవడంతో… ప్రియదర్శి చేశాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version