విజయ్ దేవరకొండ గట్టిగా ఎంజాయ్ చేస్తున్నాడు.!

-

లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ఈ సినిమాకు పూరీ కంటే విజయ్ ఎక్కువ కష్టపడ్డాడు. తన మేక్ ఓవర్ గాని , సినిమా ప్రమోషన్ ను తన భుజాల మీద వేసుకొని కష్టపడ్డాడు. తన సినిమా ను పాన్ ఇండియా సినిమా గా ప్రమోట్ చేశాడు. కాని వారి ఆశలు తలకిందులు అయ్యి సినిమా ప్లాప్ గా నిలిచింది.విజయ్, సమంత తో ఖుషి సినిమా చేస్తున్నాడు.

నిజానికి ‘ఖుషి’ చిత్రాన్ని  2022 క్రిస్మస్ రిలీజ్ అనుకొని సాధ్యం కాదని  2023 వాలెంటైన్స్ డే స్పెషల్ గా  రావాలని చూశారు.కాని సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఇది కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం సంబరాలు వేడుకగా జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులలో చాలా మంది వేరే దేశాల కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటున్నారు.

విజయ్ కూడా అయితే న్యూ ఇయర్ సందర్భంగా విదేశాల కు వెళ్ళాడు. చేతిలో శాంపైన్ బాటిల్ తో హల్చల్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫొటో పోస్ట్ చేస్తూ  అయితే ఒక ఏడాదిలో మనం ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటాం చాలాసార్లు గట్టిగా నవ్విన సందర్భాలు ఉన్నాయి .అలాగే చిన్నగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా గోల్స్ అందుకోవడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.కొన్ని సార్లు విజయం వచ్చింది మరికొన్ని సార్లు ప్లాప్స్  వచ్చాయి.ప్రతి ఒక్కదాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది జీవితం.. అంటూ విజయ్ విషెస్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news