విజయ్ దేవరకొండ ‘గల్లీ బోయ్’

-

రణ్ వీర్ సింగ్, అలియా భట్ నటించిన గల్లీ బోయ్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 230 కోట్లు వసూళు చేసిన ఈ సినిమాపై తెలుగు నిర్మాతల కన్ను పడ్డది. అందుకే అక్కడ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ రైట్స్ కొనేయడం జరిగిందట. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ లో హీరోగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

సుప్రీం హీరో సాయి తేజ్ గల్లీ బోయ్ అవుతాడని అన్నారు. కాని చిత్రలహరి ఇంటర్వ్యూస్ లో సాయి తేజ్ ఆ సినిమా చూడలేదని అలాంటి రీమేక్ ఆఫర్ ఏం రాలేదని అన్నాడు. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గల్లీ బోయ్ సినిమా రీమేక్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తాడని తెలుస్తుంది. విజయ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత శివ నిర్వాణ కూడా విజయ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. వీటితో పాటుగా గల్లీ బోయ్ గా విజయ్ చేయాల్సి ఉంది. చూస్తుంటే విజయ్ షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version